Euphoria: గుణ‌శేఖ‌ర్‌.. ‘యుఫోరియా’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:45 PM

చాలా గ్యాప్ త‌ర్వాత క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ గుణశేఖర్ (Gunasekhar) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘యుఫోరియా’

Euphoria

చాలా గ్యాప్ త‌ర్వాత క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ గుణశేఖర్ (Gunasekhar) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). భూమికా చావ్లా (Bhumika Chawla), సారా అర్జున్ (Sara Arjun), రోహిత్‌, విజ్ఞేష్ గ‌విరెడ్డి, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, నాజ‌ర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. కాగా ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి6 న థియేట‌ర్ల‌కు తీసుకు రానున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

నేడు స‌మాజంలో పెను స‌వాళ్లుగా మారిన డ్ర‌గ్స్‌, వ్య‌స‌నాలు, జెన్‌జీ క‌ల్చ‌ర్ ఇతివృత్తంలో మూవీని తెర‌కెక్కించారు. ఆపై కుటుంబాల్లో వ‌చ్చే స‌మ‌స్య‌లు, ఈ క్ర‌మంలో ఓ త‌ల్లి ఎలాంటి ట‌ర్న్ తీసుకుంది అనే క‌థ‌నంతో థ్రిల్ల‌ర్‌ను మించిన స్క్రీన్ ప్లేతో మూవీ సాగ‌నుందని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Jan 17 , 2026 | 07:14 PM