Padma Awards 2026: మమ్ముట్టికి పద్మ భూషణ్, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ
ABN , Publish Date - Jan 25 , 2026 | 06:37 PM
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 113 మందికి పద్మశ్రీ, 13 మందికి పద్మభూషణ్. 5 గురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ఆదివారం ప్రకటించింది. వీరిలో సినీ నటులు కేరళ నుంచి మమ్ముట్టి, గాయని అల్కా యాజ్ఞిక్‌లకు పద్మ భూషణ్ (Mammootty), తెలుగు నుంచి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), మురళీ మోహన్ (Murali Mohan)లకు, తమిళ నటుడు మాదవన్, బెంగాలీ నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీలకు పద్మశ్రీ, బాలీవుడ్ నుంచి దివంగత ధర్మేంద్ర (Dharmendra) కు పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది.