సంచార‌మే.. ఎంతో బాగున్న‌ది'! గోర‌టి వెంక‌న్న.. సాంగ్ మోడ్ర‌న్‌గా భ‌లే ఉన్న‌ది

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:49 PM

ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా 90 మాడిల్ క్లాస్ బ‌యోపిక్ ఫేం ఆదిత్య హాస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుత‌న్న చిత్రం ఎపిక్.

epic

ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand Deverakonda), వైష్ణ‌వి చైత‌న్య (Vaishnavi Chaitanya) జంట‌గా 90 మాడిల్ క్లాస్ బ‌యోపిక్ ఫేం ఆదిత్య హాస‌న్ (Aditya Haasan) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుత‌న్న చిత్రం ఎపిక్ (EPIC). ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ మూవీ వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన ప్రోమో మంచి రెస్పాన్స్ తీసుకు వ‌చ్చి సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్‌ చేసింది.

తాజాగా .. ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ అంటూ ఈ చిత్రం నుంచి సంచార‌మే ఎంతో బావున్న‌ది.. అంటూ సాగే హుషారైన పాట‌ను విడుద‌ల చేశారు. అనంద్‌, వైష్ణ‌విల‌పై ఈ పాట‌ను లండ‌న్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల‌లో లీలావ‌తి (Leelavathi) కొరియోగ్ర‌ఫీలో చిత్రీక‌రించారు. ప్ర‌ముఖ తెలంగాణ జాన‌ప‌ద క‌వి, గాయ‌కుడు, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్న (Goreti Venkanna) ఈ గీతానికి సాహిత్యం అందించారు. అంతేగాక సంగీత ద‌ర్శ‌కుడు హేష‌మ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) తో క‌లిసి ఆల‌పించారు.

ఇక పాట పూర్తిగా తెలంగాణ యాస‌లో సాగగా అధిక శాతం హేష‌మ్ అబ్దుల్ పాడ‌గా గోర‌టి వెంక‌న్న సాహిత్యాన్ని ఎక్క‌డా పొర‌పాట్లు జ‌రుగ‌కుండా చ‌క్క‌గా ఆల‌పించారు. గీతంలో సాహిత్యం కొత్త‌గా,అద్భుతంగా ఉండి చాలా ప్రెష్ ఫీల్ ఇచ్చేలా ఉంది. చివ‌ర‌లో గోర‌టి వెంక‌న్న వాయిస్ పాట‌కు హైలెట్‌గా నిలిచింది. అంతేగాక పాట‌లో లండ‌న్ అందాల‌ను వ‌ర్ణించుకుంటేనే లేటెస్ట్ యూత్ ట్రెండ్‌ను చ‌క్క‌గా వివ‌రించారు. చివ‌ర‌గా సంగీతం కూడా హంట్ చేసేలా ఉంది.

Updated Date - Mar 09 , 2026 | 05:00 PM