గోపీచంద్ సరసన రీతూ వర్మ..

ABN , Publish Date - Mar 10 , 2026 | 08:01 PM

మాచో స్టార్  గోపీచంద్‌ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Gopichand

మాచో స్టార్  గోపీచంద్‌ (Gopichand) హీరోగా సంకల్ప్‌రెడ్డి (Sankalpreddy) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. 7వ శతాబ్దానికి చెంది, చరిత్రలో పెద్దగా వెలుగులోకి రాని ఓ యదార్థ సంఘటన ఇతివృత్తంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుందని దర్శకుడు ఓ వేదికపై చెప్పారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్  గురించి అప్డేట్ ఇచ్చారు. ఇందులో  హీరోయిన్ గా  రీతూ వర్మ (Ritu Varma)ను ఎంపిక చేశారు. 

ఈ విషయాన్ని మేకర్స్ హీరోయిన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. రీతూ ‘సత్యవతి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. పోస్టర్‌లో చూస్తే రీతూ లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. త్వరలోనే ఇతర విషయాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. 

Updated Date - Mar 10 , 2026 | 09:07 PM