Gopichand: గోపీచంద్ సినీ జర్నీకి 25 ఏళ్లు.. 'భరతవర్ష' టీమ్ స్పెషల్ వీడియో
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:25 AM
మాచో స్టార్ గోపీచంద్ తెలుగు తెరకు పరిచయమై 25 ఏళ్ళు పూర్తయింది. ఆయన నటించిన తొలి చిత్రం ‘తొలివలపు’ విడుదలై నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది.
మాచో స్టార్ గోపీచంద్ తెలుగు తెరకు పరిచయమై 25 ఏళ్ళు పూర్తయింది. ఆయన నటించిన తొలి చిత్రం ‘తొలివలపు’ విడుదలై నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ జర్నీలో ఆయన హీరోగా, విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘భరతవర్ష’లో (BharataVarsha) నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ వీడియో విడుదల చేసింది.
'25 ఏళ్లు... ఎన్నో మధుర జ్ఞాపకాలు.. అద్భుతమైన సినీ ప్రయాణం. తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న గోపీచంద్ కు హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, కృషి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు రాబోతున్న ‘భరతవర్ష’తో మీ సత్తా చాటుతారని నమ్ముతున్నాం' అని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సంస్థ ట్వీట్ చేసింది.