Gopichand 34: ఈ కటౌట్ కి హిట్ ఎప్పుడు పడుతుందో..

ABN , Publish Date - May 03 , 2026 | 05:41 PM

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎప్పటినుంచో ఒక హిట్ కోసం కష్టపడుతోన్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్లతో చేసినా.. కంటెంట్ ఉన్న కథలతో చేసినా కూడా ఎందుకో గోపీచంద్ కి హిట్ మాత్రం దక్కడం లేదు.

Gopichand 34

Gopichand 34: మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎప్పటినుంచో ఒక హిట్ కోసం కష్టపడుతోన్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్లతో చేసినా.. కంటెంట్ ఉన్న కథలతో చేసినా కూడా ఎందుకో గోపీచంద్ కి హిట్ మాత్రం దక్కడం లేదు. అయినా కూడా గోపీచంద్ ఆగకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే భరత వర్ష సినిమా షూటింగ్ జరుపుకొంటుండగా తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించారు.


గోపీచంద్ కొత్త సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. స్టంట్ మాస్టర్ వి. వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మలయాళ బ్యూటీ అనార్కలి నటించనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


ఇక ఈ పూజా కార్యక్రమంలో గోపీచంద్ లుక్ అభిమానులను అలరిస్తుంది. వైట్ కలర్ షర్ట్, గుబురు గడ్డంతో మాస్ గా కనిపించారు. ఆ కటౌట్ కి ఎవరైనా పడిపోవాల్సిందే. కానీ, లక్ కలిసిరాక ఆయనకు ఒక మంచి హిట్ కూడా దక్కడం లేదని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఈ సినిమాలు అయినా గోపీచంద్ కి హిట్ ని అందిస్తాయేమో చూడాలి.

Updated Date - May 03 , 2026 | 06:07 PM