Goldspot: 'అంబాజీపేట మ్యారేజి బ్యాండ్' దర్శకుడి కథ, మాటలతో....
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:47 PM
అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న 'గోల్డ్ స్పాట్' మూవీ గ్లింప్స్ విడుదలైంది. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండ్' ఫేమ్ దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాను వేణు కార్తికేయన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'గోల్డ్ స్పాట్'. విజయకృష్ణ లింగమనేని సమర్పణలో రవితేజ పచ్చిపాల దీనిని నిర్మిస్తున్నారు. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండ్' సినిమా దర్శకుడు దుష్యంత్ కటికనేని 'గోల్డ్ స్పాట్'కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. దుష్యంత్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వేణు కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీచౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా మేకర్స్ 'గోల్డ్ స్పాట్' మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. హీరోయిన్ తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడు రామ్ గురించి చెబుతుండగా, ఈ టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. 'అమ్మను చిన్నప్పుడే తీసుకువెళ్లిపోయిన ఆ దేవుడే, నాకు రామ్ ను పరిచయం చేశాడంటూ... హీరోయిన్ చెప్పడం ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలియజేస్తోంది. 'మనకు జీవితంలో ఎంతోమంది పరిచయమవుతుంటారు. కానీ ఒక్కరే జీవితంగా మారిపోతారు' అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. ఎమోషనల్ డెప్త్ ఉన్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో చూడబోతున్నట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది. నరేన్ రెడ్డి సంగీతం అందిస్తున్న 'గోల్డ్ స్పాట్'కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.