ఘట్టమనేని కుటుంబం.. బర్త్‌డే వేడుకలో మహేశ్ బాబు (ఫొటోలు వైరల్)
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:23 PM
చాలాకాలం తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన ఘట్టమనేని ఫ్యామిలీతో కలిసి, కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి,
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నుంచి రెండేళ్ళ నుంచి సినిమా లేకపోవడంతో, ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్‌తో తీరిక లేకుండా ఉన్న ఆయన ఫ్యామిలీకి మాత్రం సమయం కేటాయిస్తూ, తరుచూ కుటుంబ సభ్యులతో కనిపిస్తూ, అభిమానులలో జోష్ నింపుతూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనే రీసెంట్‌గా ఒకటి జరగడం సోషల్ మీడియాలో వైరల్ అవడం చకచకా అయిపోయాయి.

మహేశ్ బాబు చిన్నాన్న ఆదిశేషగిరి రావు (Adiseshagiri Rao) కుమారుడు ఘట్టమనేని సాయి రత్న రాఘవ కవల పిల్లల పుట్టినరోజు వేడుక గడిచిన డిసెంబర్‌లో జరగగా మహేశ్ కుటుంబం అంతా ఆ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు బయటకు రాగా వాటిని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.

ఈ వేడుకలో మహేశ్ ఎన్నడు కనిపించనంత అందంగా దర్శనమివ్వడమే గాక ఆ పిల్లలను ఎత్తుకుని ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపారు. ఇంకా విశేషం ఏంటంటే ఘట్టమనేని కుటుంబం అంతా కలిసి ఒకే దగ్గర చాలా కాలం తర్వాత కనిపించడం అభిమానులకు కనులవిందు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహేశ్ లుక్‌ను యువతరం, అమ్మాయిలు బాగా ప్రశంసిస్తున్నారు.
ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో నమ్రతా శిరోద్కర్, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, సుధీర్ బాబు శ్రీమతి ప్రియదర్శిని ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఫొటోలపై మీరూ ఓ లుక్ వేయండి.
