Toxic: గీతూ మోహన్‌దాస్ పుట్టినరోజు.. 'టాక్సిక్’ స్పెషల్ వీడియో
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:23 PM
'టాక్సిక్’ మూవీ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పుట్టినరోజు సందర్భంగా షూటింగ్‌లో గీతూకు సంబంధించిన బీటీఎస్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
యశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic Movie). ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్’ అనేది ఉప శీర్షిక. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం దర్శకురాలి పుట్టినరోజు సందర్భంగా షూటింగ్‌లో గీతూకు సంబంధించిన బీటీఎస్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘గుండెకు హత్తుకునేలా ఉన్న ప్రతి దృశ్యం వెనుక, మాటల కంటే మౌనమే ఎక్కువగా మాట్లాడిన ప్రతి క్షణం వెనుక.. ఆమె ఉంది’ అని పేర్కొన్నారు. కియారా అద్వానీ, నయనతార కథానాయికలు.