రఘు కుంచే సినిమా ఎట్టకేలకు విడుదల!

ABN , Publish Date - Mar 14 , 2026 | 09:58 AM

గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'గేదెల రాజు'. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది.

Gedela Raju

రఘు కుంచే (Raghu Kunche) మల్టీటాలెంటెడ్ పర్సన్‌. టీవీ యాంకర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచే ఆ తర్వాత నటుడి అవతారమెత్తారు. 'పలాస' (Palasa) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలలో కీలక పాత్రలను పోషించారు. ఆయన టైటిల్ రోల్ ప్లే చేసిన తాజా చిత్రం 'గేదెల రాజు' (Gedela Raju). కాకినాడ తాలూకా అనేది ట్యాగ్ లైన్. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ సినిమా ద్వారా చైతన్య మోటూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వాణి రవికుమార్ మోటూరి ఈ సినిమా నిర్మాత. దర్శకుడు చైతన్యే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. 'చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు' అనేదే ఈ సినిమాలోని కోర్ పాయింట్. కొన్ని నిజ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు జనం ముందుకు రాబోతోంది. 'గేదెల రాజు' మూవీని ఏప్రిల్ 17న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.


రవిఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు 'గేదెల రాజు' సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కీలక పాత్ర పోషించిన రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి వాస్తవ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ ఇంటెన్స్ డ్రామా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Updated Date - Mar 14 , 2026 | 10:05 AM