ఏప్రిల్ 24న రాబోతున్న 'గేదెల రాజు'

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:58 PM

రఘు కుంచె కీలక పాత్ర పోషించి, సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రం 'గేదెల రాజు'. ఈ నెల 17న విడుదల కావాల్సిన ఈ సినిమాను 24వ తేదీకి వాయిదా వేశారు.

Gedela Raju Movie

రఘు కుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘు కుంచేతో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న విడుదల చేద్దామనుకున్నారు చిత్ర నిర్మాత దర్శకుడు చైతన్య మోటూరి. ఏప్రిల్‌ 17న అనేక సినిమాలు విడుదలకు సిద్ధమవ్వటంతో 'గేదెల రాజు' సినిమా హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్‌ సలహా మేరకు ఈ చిత్రాన్ని మరో వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్‌ 24న విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ తెలియచేశారు.


ఈ చిత్రం ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన రావటంతో రఘు కుంచె, చైతన్య మోటూరి మాట్లాడుతూ, 'కంటెంట్‌ ఉన్న సినిమాను పది సినిమాల మధ్యలో విడుదల చేసి ఆ సినిమా అస్థిత్వాన్ని కోల్పోయేలా చేయకూడదు అన్న ఒకే ఒక ఉద్ధేశ్యంతో సినిమాను మరుసటి వారానికి వాయిదా వేస్తున్నాం' అని అన్నారు. అలాగే సినిమా ట్రైలర్‌ చూసిన ఒక్కొక్కరు ట్రైలర్‌ చాలా కొత్తగా ఉందని, ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పటంతో ఆర్గానిక్‌గా తమ చిత్రానికి చక్కని బజ్‌ ఏర్పడిందని ఆయన అన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 02:59 PM