గేదెల రాజు.. మంచి కంటెంట్‌తో అలరిస్తాడు

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:23 AM

సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు రఘు కుంచె టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘గేదెల రాజు’.

సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘గేదెల రాజు’ (Gedela Raju). చైతన్య మోటూరి (Chaitanya Moturi) దర్శకత్వంలో వాణి రవికుమార్‌ దీనిని నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సినీ జర్నలిస్టుల స‌మ‌క్షంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.


ఈ సందర్భంగా రఘు కుంచె (Raghu Kunche) మాట్లాడుతూ ‘మా ‘గేదెల రాజు’ చిత్రంలో దమ్మున్న కంటెంట్‌ ఉందని బలంగా నమ్ముతున్నాం. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే చిత్రమిది. తొలి సీన్‌ నుంచి ప్రేక్షకుడు కథతో కనెక్ట్‌ అవుతాడు’ అని అన్నారు. దర్శకుడు చైతన్య మాట్లాడుతూ ‘రఘు కుంచె మా సినిమాతో మరోసారి సంగీత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటారు’ అని ఆకాంక్షించారు.

Updated Date - Apr 06 , 2026 | 12:03 PM