Manchu Manoj: ఇండస్ట్రీకి కులగోత్రాలు ఉండవు
ABN , Publish Date - Aug 10 , 2026 | 02:26 PM
సతీష్ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు.
సతీష్ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు మంచు మనోజ్, సునీల్ చలమలశెట్టి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ‘గజ’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.మంచు మనోజ్ మాట్లాడుతూ 'జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ చేయాలి. సతీష్ జై ఈ సినిమా కోసం ఆ రిస్క్ చేశారు. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘రాయలసీమ చౌదరి’ టైటిల్ సాంగ్ కోసం మణిశర్మ గారితో కలిసి ట్రావెల్ చేశాను. ఇండస్ట్రీకి కులగోత్రాలు ఉండవు. టాలెంట్ ఉన్నవారు కచ్చితంగా ఎదుగుతారు. ప్రతి భార్య తన భర్తకు డాక్టర్ లాంటివారే. ఇది నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నాను’ అని అన్నారు.
సునీల్ చలమలశెట్టి మాట్లాడుతూ 'నాకు సినిమాలు చూడటం అలవాటే. కానీ సినిమా కార్యక్రమాలకు గెస్ట్‌గా రావడం చాలా అరుదు. సతీష్ జై నటిస్తూ, ఎంతో ఎఫర్ట్ పెట్టి నిర్మించిన ‘గజ’ సినిమా మంచి హిట్ అవ్వాలి. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.
సతీష్ జై మాట్లాడుతూ 'ఈ సినిమాకు మంచు మనోజ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. టీమ్ అందరి సపోర్ట్‌తో ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాం. సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సునీల్ చలమలశెట్టి గారు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చే వ్యక్తి. నా లైఫ్‌లో ఆయన ఉండటం నా అదృష్టం. నేను కొత్తవాడినైనా నా వెనుక నిలబడిన వ్యక్తి మంచు మనోజ్. ఆయన గట్స్ కా బాప్. ఆయన మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.