‘రిచ్ కిడ్’ వచ్చేందుకు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 17 , 2026 | 08:52 PM

శ్రీ మంజునాథ సినిమాస్ బ్యానర్ పై.. జి మంజునాథ్ రెడ్డి నిర్మాతగా, హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రిచ్ కిడ్’. ఫాదర్ అండ్ సన్ మధ్య నడిచే ఎమోషనల్ కథాంశంతో షఫీ ఉల్లాహ్, అనిల్ దేరంగుల ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Rich Kid Movie Still

శ్రీ మంజునాథ సినిమాస్ బ్యానర్ పై.. జి మంజునాథ్ రెడ్డి (G Manjunath Reddy) నిర్మాతగా, హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రిచ్ కిడ్’ (Rich Kid). ఫాదర్ అండ్ సన్ మధ్య నడిచే ఎమోషనల్ కథాంశంతో షఫీ ఉల్లాహ్, అనిల్ దేరంగుల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు తండ్రీకొడుకుల మధ్య నడిచే కథలతో చాలా సినిమాలు వచ్చినా.. వాటికి భిన్నంగా సరికొత్త స్క్రీన్‌ప్లే‌తో ‘రిచ్ కిడ్’ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో ఎమోషన్స్‌తో పాటు కామెడీ, సంగీతం హైలెట్‌గా నిలుస్తాయని తెలుపుతూ, తాజాగా చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు.


‘రిచ్ కిడ్’ సినిమాను ఏప్రిల్ 23న (Rich Kid Release Date) ప్రేక్షకుల ముందుకు రిచ్‌గా తీసుకు వచ్చేందుకు అన్నీ సిద్ధం చేశామని తాజా అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత, హీరో అయినటువంటి జి మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది, కుటుంబం మొత్తం కలిసి వచ్చి ఈ సినిమాను చూడాలని కోరుతున్నాను. తప్పుకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్స్ షఫీ ఉల్లాహ్, అనిల్ దేరంగుల ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాము.. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాము’’ అని పేర్కొన్నారు. మంజునాథ్ రెడ్డి సరసన సుప్రియ మార్ల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రాజశేఖర్ అనింగి, చెల్లి స్వప్న, సుమన్ శెట్టి, పింగ్ పాంగ్ సూర్య, బలగం సంజయ్, జబర్దస్త్ దుర్గా రావ్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. శ్రీ వెంకట్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

Updated Date - Apr 17 , 2026 | 08:52 PM