బసవతారకం ఆస్పత్రి సేవలు మరింత విస్తరణ.. స్క్రీనింగ్ క్యాంపుల కోసం కొత్త బస్సు

ABN , Publish Date - Nov 20 , 2026 | 07:10 AM

పేద, ధనిక తేడా లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.

Nandamuri Balakrishna

ధనిక, పేద తారతమ్యం లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడానికి కృషి చేస్తామని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital), రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. ఆస్పత్రి సిబ్బంది క్యాన్సర్ స్క్రీనింగ్ (Cancer Screening Camps) క్యాంపులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సును గురువారం ఆయన ప్రారంభించారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తమ హాస్పిటల్ చేస్తున్న సేవలకు తోడుగా ఎంతో మంది దాతలు, సంస్థలు ముందుకు వచ్చి సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ బస్సును విరాళంగా ఇచ్చిన మానవీయ డెవలప్మెంట్, ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌరీశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యుడు జేఎస్ఆర్ ప్రసాద్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ ఫణి కోటేశ్వరరావు, అకాడమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ కల్పనా రఘునాథ్, సీఎస్ఆర్ విభాగపు మేనేజర్లు సరస్వతి, మాధవి, వైద్య విభాగా ధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 07:10 AM