ఇదెక్కడి విడ్డూరం.. అంత ట్రోలింగ్ లోనూ వందకోట్ల క్లబ్ లో ప్యారడైజ్

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:37 PM

సాధారణంగా ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే.. అంతే, ఆ సినిమా గురించి, కలక్షన్స్ గురించి మర్చిపోవడమే. సోషల్ మీడియాలో ఆ సినిమాపై వచ్చే ట్రోలింగ్ ని ఆపడం ఎవరి వలన కాదు.

The Paradise

సాధారణంగా ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే.. అంతే, ఆ సినిమా గురించి, కలక్షన్స్ గురించి మర్చిపోవడమే. సోషల్ మీడియాలో ఆ సినిమాపై వచ్చే ట్రోలింగ్ ని ఆపడం ఎవరి వలన కాదు. ఇక కలక్షన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కానీ, నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అమెరికా ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ప్రారంభమై, సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెగెటివ్ ట్రోల్స్‌ను, విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ నాని తన అసలైన మాస్ స్టామినాను నిరూపించుకున్నాడు.


ప్యారడైజ్ కేవలం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా మేకర్స్ రూ. 114 కోట్ల పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. ప్రీమియర్స్ నుంచే మొదలైన ట్రోల్స్ తుస్సుమనేలా సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, మిగిలిన సౌత్ రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ఊహించని రేంజ్‌లో రికార్డులు సృష్టించడం విశేషం.


ముఖ్యంగా నార్త్ అమెరికా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ 1.7 మిలియన్ల కంటే ఎక్కువ గ్రాస్ నమోదు చేయడమే కాకుండా, చాలా వేగంగా 2 మిలియన్ డాలర్ల మార్కు వైపు దూసుకుపోతోంది. ప్రతీ ప్రాంతంలోనూ సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడంతో, సినిమా మొదటి వీకెండ్ ముగిసేసరికి వసూళ్లు మైండ్ బ్లాకింగ్ రేంజ్‌లో ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


నెగెటివ్ టాక్, ట్రోలింగ్ హడావుడి నడుమ కూడా నాని మాస్ మేనియా, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లకు ప్రేక్షకులను కావాల్సినంత గ్రాండ్ గా రప్పిస్తున్నాయి. మూడో రోజు కూడా బుకింగ్స్ చాలా బలంగా ఉండటంతో, వీకెండ్ పూర్తయ్యే సమయానికి ప్యారడైజ్ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ కలక్షన్స్ చూసి నెటిజన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం.. ఇంత ట్రోలింగ్ లో కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది అంటే.. నాని రేంజ్ కనిపిస్తోందని, ఇది కదా అసలైన జడల్ జమానా అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Divyabharathi: ఒరేయ్.. బికినీ ఫోటోలు నిజమనుకున్నారు కదరా..

నానికే ఈ రేంజ్ లో ఉంటే.. దేవరకొండ పరిస్థితి ఏంటో

ప్యారడైజ్ ఎఫెక్ట్.. ఆగిపోయిన చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమా

Updated Date - Sep 26 , 2026 | 03:28 PM