అక్కినేని నాగార్జునకు కూతురు ఉందని మీకు తెలుసా.. ఆమె పేరు ఏంటంటే
ABN , Publish Date - Jul 25 , 2026 | 04:50 PM
ఏం మాట్లాడుతున్నావ్.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు అమ్మాయి ఉండడం ఏంటి.. ? ఇద్దరు అబ్బాయిలే కదా.. ? ఆ ఇద్దరు హీరోలేగా.. ? అని అనుకకుంటే.. నిజమే. అక్కినేని నాగార్జునకు ఇద్దరూ అబ్బాయిలే.
ఏం మాట్లాడుతున్నావ్.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు అమ్మాయి ఉండడం ఏంటి.. ? ఇద్దరు అబ్బాయిలే కదా.. ? ఆ ఇద్దరు హీరోలేగా.. ? అని అనుకకుంటే.. నిజమే. అక్కినేని నాగార్జునకు ఇద్దరూ అబ్బాయిలే. ఒకరు నాగ చైతన్య, ఇంకొకరు అఖిల్. ఇది అందరికీ తెల్సిన విషయమే. కానీ, చలా తక్కువమందికి తెల్సిన విషయం ఏంటంటే.. అమల డెలివరీ సమయంలో జరిగిన ఒక చిన్న కన్ఫ్యూజన్.. నాగార్జునకు కూతురుని బదులు కొడుకుని ఇచ్చింది. ఆ కొడుకే అఖిల్. ఏంటి అర్ధం కాలేదా.. అక్కినేని నాగార్జున ఆశలు ఎలా ఆవిరి అయ్యాయో ఓ పాడ్‌కాస్ట్‌లో అఖిల్ అక్కినేనినే వివరించాడు. అదేంటో చూద్దాం.
గర్భంలో ఉన్నప్పుడు స్కానింగ్‌లో పాప అని చెప్పి, డెలివరీ అయ్యాక బాబు పుట్టిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.స్కానింగ్ రిపోర్టుల్లో 5 శాతం వరకు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అఖిల్ విషయంలో కూడా అదే జరిగిందట. అఖిల్.. అమల గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా స్కానింగ్ లో పాప అని చెప్పారట. ఆ తరువాత అఖిల్ పుట్టడంతో నాగ్ షాక్ అయ్యినట్లు అఖిల్ చెప్పుకొచ్చాడు. ఈ క్రేజీ విషయం గురించి నాగార్జున గతంలోనే తెలిపాడు.. 'అమల గర్భవతిగా ఉన్న సమయంలో డెలివరీ కంఫర్ట్‌గా ఉంటుందని ఆరో నెలలోనే అమెరికా వెళ్లాం. అక్కడ పాప, బాబు అని స్కానింగ్ చేసి చూడడం తప్పు కాదు. దీంతో అమలకు ఆరో నెలలో స్కానింగ్ చేయించగా డాక్టర్లు పాప పుడుతుందని తెలియడంతో అసలు నా ఆనందానికి అవధులు లేవు. కచ్చితంగా పాపే పుడుతుంది అని అనుకున్నాను. కానీ, డెలివరీ అయ్యాక బాబు అని తెలిసి షాక్ అయ్యాను' అని నాగార్జున తెలిపాడు.
ఇక ఇదే విషయాన్ని అఖిల్ కూడా చెప్పుకొచ్చాడు. డాక్టర్లు పాప అని చెప్పడంతో నాన్న ఎగిరి గంతులేసి పాప కోసం రకరకాల ఫ్రాక్స్, డ్రెస్‌లు కొనేసి, ఆఖరికి ఇండియా తిరిగి రావడానికి పాస్ పోర్ట్, ఫ్లైట్ టికెట్ కూడా నిఖిత అనే పేరు మీద బుక్ చేశారు. డెలివరీ తరువాత నన్ను చూసి.. నాన్న షాక్. ఏంటిది.. అని అనుకున్నారట. నాకు తెలియదు ఈ విషయం అమ్మ చెప్పింది. నాన్న చాలా డిజప్పాయింట్ అయ్యారు' అని చెప్పుకొచ్చాడు. అలా నిఖిత కాస్త అఖిల్ అయ్యాడు. నిజంగా డాక్టర్లు చెప్పినట్లు అమ్మాయి పుట్టి ఉంటే.. అక్కినేని ఇంటి వారసురాలిగా నిఖిత ఉండేది. అందుకే నాగ్ తన కోడళ్లనే కూతుర్లుగా చూసుకుంటానని, తనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్తుంటాడు.