Reality: భజగోవిందం.. బతుకే కోలాహలం! సింగర్ వయకామ్ విజయలక్ష్మికి.. మరో నేషనల్ అవార్డు ఖాయం
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:17 AM
దైనందిన జీవితంలోని సహజమైన భావోద్వేగాలను, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఆనందాలను అందంగా రియాలిటీ చిత్రంతో ప్రజెంట్ చేయ దానికి సిద్ధమవుతున్నారు కిరణ్ అబ్బవరం.
దైనందిన జీవితంలోని సహజమైన భావోద్వేగాలను, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఆనందాలను అందంగా రియాలిటీ (Reality) చిత్రంతో ప్రజెంట్ చేయ దానికి సిద్ధమవుతున్నారు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు కథను సమకూర్చి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. దేవిక భట్ హారోయున్గా పరిచయం అవుతుండగా సాయి కుమార్, శరత్ కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సుధాకర్ చాగంటి నిర్మాత. ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ భజ గోవిందం.. బతుకే కోలాహాలం (Bhaja Govindam Bhaja Govindam Brathuke Kolaahalam) అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. ఈ పాటకు సనారే (Sanare) సాహిత్యం అందించగా భీమ్స్ (Bheems Ceciroleo)సంగీతంలో ప్రముఖ మలయాళీ గాయని, ఇటీవలే నేషనల్ అవార్డ్ అందుకున్న వయకామ్ విజయలక్ష్మి (Vaikom Vijayalakshmi) ఆలపించడం విశేషం.
జీవితంలోని చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలనే సినిమా ప్రధాన సందేశాన్ని ఆవిష్కరించే పాట ఇది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను కిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుద చేసిన ఈ మూవీ టీజర్ సైతం మంచి ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంది.