సమంత సీమంతం.. ఎంత ముద్దుగా ఉందో

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:33 PM

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన దశను ఆస్వాదిస్తున్న విషయం తెల్సిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ని రెండో వివాహం చేసుకున్న సామ్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.

Samantha

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన దశను ఆస్వాదిస్తున్న విషయం తెల్సిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ని రెండో వివాహం చేసుకున్న సామ్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లోనే ఈ విషయాన్ని ఆమె అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన సామ్ .. రెస్ట్ లో ఉంది. ఇక తాజాగా గర్బిణిగా ఉన్న సామ్ కి ఆమె స్నేహితులు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రాజ్ - సమంతఒక సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. సమంత గర్భిణిగా ఉండటంతో స్నేహితులంతా కలిసి ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ప్లాన్‌తో అక్కడే చాలా సైలెంట్‌గా ఆమెకు సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ ఊహించని మధురమైన క్షణానికి సమంత దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.


స్నేహితులు చేసిన ఈ క్యూట్ సర్ప్రైజ్‌లో భాగంగా సమంతకు కొత్త బట్టలు పెట్టి, తీపి పదార్థాలు తినిపించి పెద్దలంతా ఆశీర్వదించారు. ఈ అందమైన వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈఫోటోలలో సమంత, రాజ్ నిడిమోరు జంట మెరూన్ రంగు సాంప్రదాయ దుస్తులలో ఒకే రంగులో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రెగ్నెన్సీ గ్లోతో కలకలలాడుతున్న సమంత తన ప్రియమైన వారితో ముచ్చటిస్తూ ఎంతో అందంగా కనిపించింది.


ప్రస్తుతం సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ప్రెగ్నెన్సీ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న సమంత.. రాబోయే డిసెంబర్‌లో తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఎన్నో ఏళ్లుగా సామ్ తల్లి కావాలని కలలు కంటూ వస్తోంది. ఇక ఇన్నాళ్ళకు ఆమె కల నెరవేరబోతోంది. బిడ్డకు జన్మనిచ్చాక సామ్ మళ్లీ సినిమాలలో కనిపిస్తుందా.. ? లేక నిర్మాతగా కోనసాగుతోందా అనేది చూడాలి. ఇక సామ్ ఇంటికి వారసుడు వస్తాడా.. వారసురాలు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:34 PM