గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నిరీక్షణ హీరో..
ABN , Publish Date - Aug 11 , 2026 | 05:05 PM
'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది'.. 'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై'.. ఈ సాంగ్స్ విన్నప్పుడల్లా మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి.
'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది'.. 'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై'.. ఈ సాంగ్స్ విన్నప్పుడల్లా మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎదురుచూసిన ఆ హీరోనే భానుచందర్. తెలుగు, తమిళ చిత్రసీమలో ఒకప్పటి ప్రముఖ కథానాయకుడు, విలక్షణ నటుడు భానుచందర్. ముఖ్యంగా 1980వ దశకంలో తనదైన బాడీ లాంగ్వేజ్, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం, యాక్షన్ డ్రామాలతో యాక్షన్ హీరోగా మంచి ప్రజాదరణ పొందారు. నిరీక్షణ, మంచి మనసులు, సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాలలో ఆయన నటన ఎంతో ప్రశంసలు అందుకుంది. హీరోగా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
ఇక ఒకప్పటి యాక్షన్ హీరో భానుచందర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తాజాగా ఆయన అగధ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు. ఏంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భానుచందర్ ని చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. పూర్తిగా నెరిసిపోయిన గడ్డం, జుట్టుతో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుండటంతో ఆయనను చూసిన అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రస్తుతం 73 ఏళ్ల వయస్సున్న భానుచందర్.. ఎటువంటి మేకప్ లేకుండా చాలా సహజమైన లుక్‌లో కనిపించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట కూడా తడబడడంతో అయ్యో ఆయనకు ఏమైంది అని నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఫిట్‌గా, డైనమిక్‌గా కనిపించిన తమ అభిమాన నటుడు ఇప్పుడు వయోభారంతో కూడిన సహజ సిద్ధమైన లుక్‌లో కనిపించడంతో అభిమానులు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భానుచందర్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.