Nari Nari Naduma Murari: సంక్రాంతికి.. హిట్ కొట్టి చూపించాం
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:30 AM
సంక్రాంతి పండుగ అంటేనే కొత్త సినిమాల సందడి. 2026 సంక్రాంతికి కూడా థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడాయి.
సంక్రాంతి పండుగ అంటేనే కొత్త సినిమాల సందడి. 2026 సంక్రాంతికి కూడా థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడాయి. ఈ పండుగ సీజన్‌లో 5 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా, వాటిలో ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) సినిమా మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించింది.
ఈ సంక్రాంతికి విడుదలైన ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాల నడుమ గట్టి పోటీ నెలకొంది. అయినా ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్, మౌత్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భగా మేకర్స్ ఓ ఈవెంట్ నిర్వహించారు.
శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. థియేటర్లలో నవ్వులు, చప్పట్లు వినిపిస్తున్నాయంటేనే సినిమా ఎంతగా కనెక్ట్ అయిందో అర్థమవుతోంది. చాలామంది ప్రేక్షకులు 2026 సంక్రాంతికి పూర్తి స్థాయి వినోదాన్ని అందించిన చిత్రంగా దీనిని అభివర్ణిస్తున్నారు. అదే జోష్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్ కొనసాగిస్తోందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా శర్వానంద్ నటన సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్‌లో చూపించిన సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కథనంలో హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ డ్రామా అన్నీ సమతుల్యంగా మేళవించడం సినిమాను పండుగ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టింది.
సంయుక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో మెప్పించగా, వారి నటన కథకు మంచి బలం చేకూర్చింది. దర్శకుడు రామ్ అబ్బరాజు కథను ఆసక్తికరంగా మలిచిన తీరు, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చివరి వరకు బోర్ కొట్టనివ్వడం లేదు.సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత శక్తినిచ్చాయి.
చిరంజీవి, నవీన్ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అంటూ దిల్ రాజు, కంటెంట్‌తో వస్తే ఎవడైనా హిట్ కొట్టాల్సిందే అంటూ సంయిక్త, సంక్రాంతికి హిట్ కొట్టి చూపించాం అని దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సందర్భంగా తెలిపారు.