షాకింగ్.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Sep 06 , 2026 | 03:19 PM

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటన తెలుగు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం, ఊహించని వివాదాలు, పోలీసు కేసుల అనంతరం ఆమె ఈ తీవ్ర నిర్ణయానికి పూనుకోవడం సంచలనంగా మారింది.

Madhuri Rathod

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటన తెలుగు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం, ఊహించని వివాదాలు, పోలీసు కేసుల అనంతరం ఆమె ఈ తీవ్ర నిర్ణయానికి పూనుకోవడం సంచలనంగా మారింది. ఈ మధ్యనే మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయికి సంబంధించిన ఒక వివాదాస్పద ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈశ్వర్ సాయి గదిలో మాధురి రాథోడ్ దొరకడంతో, ఆగ్రహానికి గురైన ఈశ్వర్ సాయి భార్య మాధురిపై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఇక ఈ వీడియోలు బయటకు వచ్చాక ఈశ్వర్ సాయి మొదట ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి వల్లే అలా జరిగిందని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత వెంటనే తన రూమ్ వాష్ రూమ్ లో వేరొకరు ఉండడంతో మాధురి వాష్‌రూమ్‌కి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇంకోపక్క మాధురి కొన్నిరోజులు అసలు ఈ విషయంతో తనకేమి సంబంధం లేనట్లు నార్మల్ గా వీడియోలు చేస్తూ కనిపించింది. ఇక మూడు రోజుల క్రితం మాధురి.. ఈశ్వర్ సాయిపై కేసు పెట్టింది.


పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకోవడమే కాకుండా, తనను తీవ్రంగా మోసం చేశాడని, మార్ఫింగ్ వీడియోలతో వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేసింది. మాధురి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చెప్పటినట్లు తెలిపారు. అయితే కేసు పెట్టి రోజులు గడుస్తున్నా పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకపోవడం, ఈ కేసు విషయంలో వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాధురి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ ఆవేదనతోనే ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు సమయస్ఫూర్తితో డోర్ పగలగొట్టి ఆమెను కాపాడారు. ప్రస్తుతం మాధురి హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరారీలో ఉన్న ఈశ్వర్ సాయిని త్వరగా పట్టుకోవాలని నెటిజన్స్ సైతం పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 03:19 PM