Prabhas: ప్ర‌భాస్‌.. అరుదైన ఘ‌న‌త‌! జ‌పాన్ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై.. తొలి ఇండియ‌న్ స్టార్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 09:20 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ జపాన్‌ ప్రముఖ మహిళా మ్యాగజైన్‌ ‘ANAN’ బ్యాక్‌ కవర్‌పై సోలోగా ఫీచర్‌ అయ్యి కొత్త రికార్డు సృష్టించారు.

prabhas

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) ఓ అరుదైన ఘ‌న‌తను ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశం నుంచి ఏ హీరోకు సాధ్యం కానీ విధంగా జ‌పాన్‌లోని ఓ ప్ర‌ముఖ మ్యాగ్‌జైన్‌లో బ్యాక్ క‌వ‌ర్ పేజీపై క‌నిపించిన న‌టుడిగా చ‌రిత్ర సృష్టించాడు. జపాన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన మహిళా మ్యాగజైన్‌గా పేరున్న‌ ‘ANAN’ బ్యాక్‌ కవర్‌పై సోలోగా ఫీచర్‌ అయిన తొలి భారతీయ నటుడిగా ఆయన కొత్త చరిత్ర లిఖించాడు.

prabhas.jfif

‘బాహుబలి’ సిరీస్‌తో జపాన్‌లో అపారమైన క్రేజ్‌ సంపాదించిన ప్రభాస్‌కు అక్కడి అభిమానులు ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. ఈ కారణంగానే ‘ANAN’ మ్యాగజైన్‌ ఎడిటోరియల్‌ టీమ్‌ ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు సమాచారం. భారతీయ సినీ నటుడికి ఈ స్థాయి అంతర్జాతీయ గుర్తింపు రావడం అరుదైన విషయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్‌ బేస్‌ కలిగిన ప్రభాస్‌కు ఇప్పుడు ఈ మ్యాగజైన్‌ కవర్‌తో ఆయన గ్లోబల్‌ స్టార్డమ్‌ మరింత బలపడింది.

ప్ర‌స్తుతం ప్రభాస్ ఈ ఫోటోషూట్‌ స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా, అభిమానులు “ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌” అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో ప్రభాస్‌ సినిమాలకు భారీ డిమాండ్‌ ఉండగా, ఈ తాజా ఘనత ఆయనకు జపాన్‌లో మరింత పాపులారిటీని తీసుకురానుంది.

Updated Date - Feb 06 , 2026 | 09:53 AM