VIROSH: హమ్మయ్యా.. మొత్తానికి విజయ్, రష్మిక డిక్లేర్ చేశారు
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:40 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఎట్టకేలకు తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు.
టాలీవుడ్ మోస్ట్ హ్యాపనింగ్ ఫెయిర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) లు మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైపూర్ ప్యాలెస్‌లో వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతుండగా సమీప బంధువులు, వీవీఐపీలు మాత్రమే ఈ వేడుకకు హజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన వారం పది రోజులుగా వీరి పెళ్లి సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం ఎక్కడా అధికారికంగా దృవీకరించలేదు. అలా వచ్చిన వార్తలను ఖండించనూ లేదు. దీంతో అంతా పెళ్లి హాడావుడిలోనే ఉండిపోయారు.
ఈ క్రమంలో తాజాగా ఆదివారం రష్మిక, విజయ్ స్వయంగా తమ పెళ్లి గురించి ఫస్ట్ టైం అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరు ఒకే ప్రకటనను తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బయటకు వెళ్లడించారు. ఆ లెటర్‌లో.. మమ్ములను అమితంగా ప్రేమించే అభిమానులకు.. మాకు సంబంధించి ఏ నిర్ణయమైనా, ప్రణాళిక జరుగక ముంందే మీరు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటున్నారు. అంతే ప్రేమతో మాకు VIROSH అనే పేరు సైతం పెట్టారు.
అందుకే మా జంటకు అదే పేరును కంటిన్యూ చేస్తున్నాం మా వేడుకను ది వెడ్డింగ్ ఆఫ్ VIROSH అని పిలవాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు మీకు థ్యాంక్స్. మాలో ఎప్పటికీ మీరూ ఓ భాగమే అని లెటర్‌లో వ్రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా.. ఈ లెటర్ చూసిన వారు.. హమ్మయ్యా ఇప్పటికైనా డిక్లేర్ చేశారంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాబోయే వధూవరులకు దేశవ్యాప్తంగా నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.