కాకా.. భార్య దొరికేసింది? స్నేహాకు.. బంపర్ ఛాన్స్
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:34 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ (Kaka) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ (Kaka) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్‌తోనే కథపై ఆసక్తి పెంచిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సీనియర్ నటి స్నేహ (Sneha)ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఏకంగా చిరంజీవి భార్య పాత్రలో ఆమె కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.చిరంజీవితో కలిసి నటించాలనేది తనకు చాలా కాలంగా ఉన్న కోరిక అని స్నేహ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘కాకా’లో ఆమెకు అవకాశం దక్కిందనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న స్నేహ.. ఈ చిత్రంలో కనిపిస్తే ఆమె అభిమానులకు కూడా ఇది ప్రత్యేకమైన ట్రీట్‌గా మారనుంది. ఇప్పటికే నాగార్జునతో రామదాసు, రాజన్న వెంకటేశ్‌తో సంక్రాంతి, బాలకృష్ణ పాండురంగడు సినిమాల్లో నటించిన స్నేహ ఇప్పుడు చిరంజీవితోనూ నటిస్తుండడంతో టాలీవుడ్ టాప్ స్టార్స్ నలుగురితో కలిసి నటించిన అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకటిగా నిలువనుంది. గతంలో సౌందర్య, రమ్యకృష్ణ, మీనా, రోజా, సిమ్రాన్, టబు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.
కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి నిర్మాత కేవీఎన్, చిరంజీవి విశ్వంభర ప్రొడ్యూసర్ విక్కీ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. అంతేకాదు త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సైతం విడుదల చేయనున్నట్లు తెప్తోంది. ఇక ‘కాకా’లో చిరంజీవి కె. సత్యం అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆక్వా పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సాధారణ వ్యక్తిలా కనిపించే ఈ పాత్ర వెనుక బలమైన కథ ఉన్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సూచిస్తోంది. మలయాళ నటి అనశ్వరా రాజన్ (Anaswara Rajan) అమ్ములు పాపగా కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ముందుగా చెప్పిన ప్రకారం ఈ సంక్రాంతికే జనవరి 13న ప్రేక్షకుల ఎదుటకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.