బాలకృష్ణ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఇక త‌గ్గేదేలే!

ABN , Publish Date - Mar 05 , 2026 | 06:36 PM

బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఎట్ట‌కేల‌కు ప్రారంభించారు.

Balakrishna

నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand malineni,) దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 111వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 2025లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు (venkat satish kilaru) నిర్మిస్తున్నారు. అయితే చారిత్ర‌క నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని ముందె తెలిపిన మేక‌ర్స్ మూడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ ప్రారంభించారు. కానీ బడ్జెట్ త‌దిత‌ర ఇష్యూల‌తో మూవీని మ‌ధ్య‌లోనే ఆపి వేశారు. ఆపై మ‌రో కొత్త స్క్రిఫ్టుతో త్వ‌ర‌లోనే తిరిగి షూటింగ్ ఆరంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్ డేట్ వెలువడింది. గురువారం రాత్రి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ (Arvind S Kashyap, ISC) షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఆసక్తికరమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది.

ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ నేప‌థ్యంలో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార (Nayantara) నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగానే, బాలకృష్ణ కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని చిత్ర పరిశ్రమలో విశేషంగా వినిపిస్తోంది. 'మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం' వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరొందారు వివేక్ ఆత్రేయ. మొదటిసారి సీనియర్ స్టార్ బాలకృష్ణతో పనిచేయబోయే చిత్రానికి వివేక్ ఎలాంటి సబ్జెక్టును సిద్ధం చేశారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

క్లాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ దశలో ఉండగానే, వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ గురించిన వార్తలు రావడం నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.

Updated Date - Mar 05 , 2026 | 06:36 PM