NBK 112: హమ్మయ్యా.. బాలయ్యకు భామ దొరికేసింది!
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:52 PM
బాలకృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దేవర వంటి సంచలన విజయం తర్వాత కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి తాజాగా కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య బాబు ఇప్పటివరకు చూడని సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, ముఖ్యంగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు బలమైన సామాజిక అంశాలు ఉండేలా కొరటాల శివ చాలా కసరత్తులు చేశారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, ఎమోషనల్ డెప్త్ ఉన్న యూనివర్సల్ పాయింట్‌ను ఈ చిత్రంలో టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అయితే ఈ మొదటి షెడ్యూల్‌లో నందమూరి బాలకృష్ణ పాల్గొనడం లేదని సమాచారం. కేవలం బాలయ్య లేని సన్నివేశాలతో పాటు కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. సుమారు 15 రోజులకు పైగా ఈ తొలి షెడ్యూల్ నిరంతరాయంగా సాగనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపికపై గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ని కథానాయికగా ఫైనల్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఈ చిత్రంలో లేడీ విలన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ రెగ్యులర్ కు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ఈ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఎస్ ఎల్వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండటంతో త్వరలోనే సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కొరటాల శివ అల్లిన ఈ సరికొత్త కథ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.