అటు ఫౌజీ.. ఇటు స్పిరిట్‌! ఒత్తిడిలో ప్ర‌భాస్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:13 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు.

Fauzi vs spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ (Fauzi) కాగా, మరోవైపు సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న స్పిరిట్. ఈ రెండు భారీ చిత్రాల షూటింగ్‌లతో ఆయన బిజీగా గడుపుతున్నారు. ఈ రెండు చిత్రాల విడుదల తేదీల ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రభాస్ రేయింబవళ్లు కష్టపడుతున్నారు.

ఫౌజీ సినిమా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు దాటడంతో, ఈసారైనా ఈ సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్ 3న ఫౌజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నెల నుంచే ఫౌజీకి సంబంధించి వరుస సర్‌ప్రైజ్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి.

అంతేకాకుండా, ఫౌజీ విడుదలైన కేవలం మూడు నెలల వ్యవధిలోనే సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్స‌ (spirit) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు భారీ సినిమాల షూటింగ్‌లను ప్రభాస్ ఒకేసారి చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫౌజీ షూటింగ్‌లో ఏమాత్రం ఆలస్యమైనా, అది నేరుగా స్పిరిట్ సినిమా షెడ్యూల్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రభాస్ కొద్దిగా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకే సమయంలో రెండు భారీ ప్రాజెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి రిస్క్‌లు ఇండస్ట్రీలో కామనే అయినప్పటికీ, తన అంకితభావంతో ప్రభాస్ వీటిని ఎలా అధిగమిస్తారనేది చూడాలి.

మొదట్లో ఫౌజీ సినిమా ఫస్ట్ లుక్ రాకముందు ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఒక్క పోస్టర్‌తో ఆ అంచనాల స్థాయిని మేకర్స్ పూర్తిగా మార్చేసేశారు. ఇక 'స్పిరిట్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ మూవీగా ఉండబోతోందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ రెండు సినిమాలపై అంచనాలు ఒకదానిని మించి మరొకటి ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ భారీ విజయాలను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి ఈ డబుల్ ట్రీట్‌తో ప్రభాస్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా ఏలుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Sep 06 , 2026 | 11:24 PM