ఆ సినిమాకు బుద్ధిలేక నో చెప్పా..

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:04 PM

ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు తమ వద్దకు వచ్చిన కథలకు నో చెప్తారు. అలా నో చెప్పడానికి చాలా కారణాలు ఉన్నా.. ఆ సినిమా హిట్ అయితే మాత్రం కొన్నిసార్లు అందులో నటించలేకపోయినందుకు ఫీల్ అవుతూ ఉంటారు.

Faria Abdullah

ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు తమ వద్దకు వచ్చిన కథలకు నో చెప్తారు. అలా నో చెప్పడానికి చాలా కారణాలు ఉన్నా.. ఆ సినిమా హిట్ అయితే మాత్రం కొన్నిసార్లు అందులో నటించలేకపోయినందుకు ఫీల్ అవుతూ ఉంటారు. తాజాగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కూడా ఒక హిట్ సినిమాలో నటించలేకపోయినందుకు ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై చిట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా ఆమె నటించిన గాయపడ్డ సింహం (Gayapadda Simham) సినిమా మే 1 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కశ్యప్ దర్శకత్వం వహించారు.


గాయపడ్డ సింహం ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా హనుమాన్ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డారు. అదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని తెలిపారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. అమ్రితా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2024 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అవకాశం మొదట ఫరియా వద్దకే వచ్చిందట. కానీ, దానిని ఆమె మిస్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.


'నాకు మొదట తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది చేయలేకపోయాను. ఆ సమయంలో నాకు బ్రెయిన్ లేదు. బుద్ధిలేక నో చెప్పా. అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. ఎలాంటి కథను ఎంచుకోవాలో తెలిసేది కాదు. జాతిరత్నాలు తరువాత ఏ స్క్రిప్ట్ ని ఓకే చేయాలో తెలియలేదు. బాగా అలోచించి సరైన స్క్రిప్ట్ ని ఎంచుకోవాలి అని ఆలోచిస్తూ.. హనుమాన్ కథను అంచనా వేయలేకపోయాను. అందుకే దానిని చేయలేకపోయాను. నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇక ముందు నా కెరీర్ లో మంచి స్క్రిప్ట్స్ ను ఎంచుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు.

Updated Date - Apr 29 , 2026 | 02:15 PM