సుడిగాలి సుధీర్.. గోట్ వదిలేయ్

ABN , Publish Date - Nov 12 , 2026 | 07:47 PM

ఒక మెజిషియన్ గా హైదరాబాద్ కి వచ్చి జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).

ఒక మెజిషియన్ గా హైదరాబాద్ కి వచ్చి జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). సింగింగ్, డ్యాన్సింగ్, యాంకరింగ్, యాక్టింగ్ ఇలా అన్నింటిలో తన ప్రత్యేకతను చాటుకుంటూ బుల్లితెర మెగాస్టార్ గా మారాడు. ఎప్పుడైతే ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడో .. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గాలోడు సినిమాతో సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలను మొదలుపెట్టినా.. అవేమి ఆశించిన ఫలితాలను అందివ్వలేదు. అప్పట్లో సుధీర్ ఆశలన్నీ గోట్ సినిమా మీదనే పెట్టుకున్నాడు.


సుధీర్ సరసన కోలీవుడ్ భామ దివ్యభారతి హీరోయిన్ గా పరిచయమవుతుంది అనేసరికి ప్రేక్షకుల్లో కూడా కుర్రాడు మంచి సినిమానే పట్టాడు అనుకున్నారు. అంతేనా అప్పట్లో ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి సాంగ్ ఒక ఊపు ఊపేసింది. అంతా బాగుండి ఉంటే గోట్ రిలీజ్ అయ్యి ఏడాది అయ్యేది. కానీ, మధ్యలో బడ్జెట్ సమస్యలు,డైరెక్టర్ వివాదాలు అన్ని కలిపి ఈ సినిమాని వెనక్కి నెట్టాయి. అసలు కొన్నిసార్లు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఇన్ని జరిగినా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి.. వాటన్నింటిని తొలగించి ఇన్నేళ్లకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.


ఎన్నో అంచనాల నడుమ ఈ గురువారం రిలీజ్ అయిన గోట్ మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. అప్పట్లో అయితే ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందుకొనేదేమో కానీ, ఇప్పుడైతే రొటీన్ కథ అని చెప్పుకొస్తున్నారు. అక్కడక్కడా జబర్దస్ జోకులు పేలాయి కానీ, కథ, కథనం కొత్తగా లేవని పెదవి విరుస్తున్నారు. నటుడిగా సుధీర్ ఇంకా ఎదగాలని అంటున్నారు. దివ్యభారతి అందంతో ఆకట్టుకున్నా.. ఫలితం లేదని చెప్పుకొస్తున్నారు. ఈ గోట్ సినిమా రిజల్ట్ ని వదిలేసి సుధీర్ ని తన తదుపరి సినిమాపై ఫోకస్ చేయాలనీ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ నటిస్తోన్న కొత్త చిత్రం హైలెస్సో. కుమార్ కోట దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 12 , 2026 | 07:52 PM