మంచి మనసు చాటుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:24 PM

అభిమానులకు సహయం చేయడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరోసారి తన ఉదారతతో అభిమానుల పట్ల ఉన్న పెద్ద మనసును చాటుకున్నారు.

Varun Tej

అభిమానులకు సహయం చేయడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరోసారి తన ఉదారతతో అభిమానుల పట్ల ఉన్న పెద్ద మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన అభిమానికి అండగా నిలిచి, ఆయన ప్రాణాలను కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న సురేష్ పాటిల్ అనే అభిమాని పరిస్థితి గురించి తెలుసుకున్న వరుణ్ తేజ్ వెంటనే స్పందించి, ఆయనకు అవసరమైన పూర్తి వైద్య సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాడు.


హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో సురేష్ పాటిల్‌కు అత్యుత్తమ వైద్యం అందేలా స్వయంగా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును కూడా వరుణ్ తేజ్ భరించాడు. అంతేకాకుండా అభిమాని ఆరోగ్యం మెరుగుపడి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ పూర్తి ఆసరాగా నిలిచాడు. ప్రస్తుతం ఆ అభిమాని కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా వరుణ్ తేజ్ చేసిన ఈ గొప్ప సాయాన్ని ప్రశంసిస్తున్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్‌లోనూ వరుణ్ తేజ్ చూపించిన ఈ మానవత్వంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.


ఇక వరుణ్ కెరీర్ గురించి చెప్పాలంటే.. కొన్నేళ్లుగా ఆయనకు మంచి హిట్ పడలేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు సినిమాపైనే పెట్టుకున్నాడు. మేర్లపాక్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాలికి గాయం అయినా లెక్కచేయకుండా వరుణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మరి ఈ సినిమాతోనైనా వరుణ్ మంచి హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.

Updated Date - Jul 29 , 2026 | 08:25 PM