మహేష్ బాబు.. ఏంట్రా ఇలా అయిపోయాడు
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:43 PM
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే అవకాశాలు అయినా.. గుర్తింపు అయినా. అందుకే హీరోయిన్స్ ఎప్పుడు కూడా ఆ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. పొట్ట కట్టుకొని డైటింగ్ చేస్తూ అందాన్ని పెంచుకుంటూ ఉంటారు.
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే అవకాశాలు అయినా.. గుర్తింపు అయినా. అందుకే హీరోయిన్స్ ఎప్పుడు కూడా ఆ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. పొట్ట కట్టుకొని డైటింగ్ చేస్తూ అందాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య అందాన్ని కాపాడుకోవడానికి హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా కష్టపడుతున్నారు. అలా కష్టపడేవారిలో మొదటిపేరు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ది ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 51 ఏళ్ల వయస్సులో కూడా మహేష్ అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేష్ ని చూసిన ప్రతిసారీ ఆయన వయస్సు పెరుగుతుందా.. తరుగుతుందా అనే అనుమానం అందరిలో మెదులుతూ ఉంటుంది.
అయితే ఈసారి ఆ అనుమానం మరింత పెరిగింది. దానికి కారణం మహేష్ మరింతగా బక్కచిక్కి కనిపించడమే. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక రేర్ ఫోటోను షేక్ చేశాడు మహేష్. అందులో ఆయన ఒక కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉండగా .. ఎదురుగా చెక్క మీద కార్తికేయ కూర్చున్నాడు. ఇద్దరూ ఒక డీప్ డిస్కషన్ లో ఉండగా ఈ ఫోటో తీసినట్లు కనిపిస్తుంది. కచ్చితంగా ఇది మహేష్ ఇల్లులానే అనిపిస్తుంది. అయితే వారణాసి లుక్ లోనే మహేష్ కనిపించాడు. కానీ, ఆయన లుక్ మొత్తం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది.
డైట్ పేరుతో అన్నం తినకుండా.. ఒకేసారి మనిషి మొత్తం తగ్గిపోయినట్లు కనిపించాడు. లూజ్ టీ షర్ట్, ప్యాంట్స్ లో నుంచి మహేష్ బక్కచిక్కిన కాళ్లను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ఆ చేతుల మీద నరాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. చాలా బక్కగా.. బాగా తగ్గి కనిపించడంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మహేష్.. ఇలా ఉన్నాడేంటి. తినడం లేదా.. ? లేక క్యారెక్టర్ కోసం ఏదైనా ప్రయోగం చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందం కోసం మరీ ఇంతగా డైట్ చేయాల్సిన అవసరం లేదని, ఆరోగ్యంగా ఉండాలని, అన్నం టిని మళ్లీ మహేష్ నార్మల్ స్థితికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మరి ఫ్యాన్స్ ఆందోళనని అర్ధం చేసుకొని మహేష్ కొంచెం తిని యధాస్థితికి చేరుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.