కొత్త లుక్ లో ఎన్టీఆర్.. ఏమున్నాడ్రా బాబు

ABN , Publish Date - May 08 , 2026 | 02:56 PM

ఎన్టీఆర్ (NTR)గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

NTR

ఎన్టీఆర్ (NTR)గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన మేకోవర్ గురించి.. ప్రతి సినిమాకు కొత్తగా ఉండాలని ట్రై చేసే హీరోల్లో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. ఇక దేవరలో తండ్రికొడుకుల పాత్రకు డిఫరెన్స్ తెలియడానికి.. బరువు తగ్గి ఒక క్యారెక్టర్ లో కనిపించగా.. బరువు పెరిగి మరో క్యారెక్టర్ లో కనిపించాడు. దేవర తరువాత ఎన్టీఆర్ బాడీలో చాలా మార్పులు వచ్చాయి. సడెన్ గా బరువు తగ్గి కనిపించాడు.


కొన్నిసార్లు ఎన్టీఆర్ ని చూసి అభిమానులే భయపడ్డారు అంటే అతిశయోక్తి లేదు. ఆ తరువాత ఎన్టీఆర్ లుక్ మారుతూవచ్చింది. ఎన్టీఆర్ నీల్ కోసం కండలు పెంచుతూ మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. సినిమాలు పక్కన పెడితే.. ఎన్టీఆర్ యాడ్ షూట్స్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ని సంగీత దర్శకుడు థమన్.. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.


బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో వైట్ బనియన్ వేసుకొని, గుబురు గడ్డంతో, తడి హెయిర్ నుదిటిపై గాలికి ఊగుతూ ఉంటే.. నోటిలో టూత్ పిక్ పెట్టుకొని యాటిట్యూడ్ లుక్ తో ఎన్టీఆర్ అదిరిపోయాడు. అసలు ఇలాంటి ఒక లుక్ లో ఎన్టీఆర్ కనిపించడమే అభిమానులను షాక్ కి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్.. ఇదే లుక్ లో ఒక్క సినిమా పడితే ఇండస్ట్రీ హిట్ ఖాయమని, అబ్బబ్బా ఏమున్నాడ్రా బాబు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తోన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మురుగా సినిమాను పట్టాలెక్కించనున్నాడు. మరి ఈ లుక్ ఏమైనా ముందు ముందు సినిమాల్లో వాడతాడేమో చూడాలి.

Updated Date - May 08 , 2026 | 03:27 PM