ఎన్టీఆర్ చిన్న కుమారుడు.. పెయింటింగ్ అదరగొట్టాడుగా
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:32 AM
స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన జూ. ఎన్టీఆర్ (NTR) వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు.
స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన జూ. ఎన్టీఆర్ (NTR) వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రానివ్వరు. కాకనోతే ఫంక్షన్లు, విహార యాత్రలకు వచ్చి పోయే సందర్భాల్లో వారి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చి కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాల్లో హడావుడి చేస్తుంటాయి. అభిమానులు ఊడా వాటిని అపురూపంగా పరిగణిస్తూ వాటిని ఇతరులతో పంచుకుంటుంటారు.
ఎన్టీఆర్‌కు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు అభయ్ రామ్ (11) (Abhay Ram), చిన్న కుమారుడు భార్గవ్ రామ్ (7) (BhargavRam)ఇద్దరూ హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ (Oakridge International School) లో విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిసింది. కాగా ఇటీవల వీరికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్కూల్‌లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో భార్గవ్ రామ్ పాల్గొనగా తన చేతిలో అప్పుడే వేసిన ఏనుగు పెయింటింగ్‌ను పట్టుకుని నిలబడ్డాడు. ఈ ఫొటో కాస్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. భార్గవ్ రామ్ డ్రాయింగ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.