Samyuktha menon: కొందరికి రోజువారీ విధిగా మారిపోయింది

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:37 PM

తన ఎదుగుదలను జీర్ణించుకోలేకే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని హీరోయిన్‌ సంయుక్తా మేనన్‌ అంటున్నారు.

తన ఎదుగుదలను జీర్ణించుకోలేకే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని హీరోయిన్‌ సంయుక్తా మేనన్‌ (Samyuktha menon) అంటున్నారు. తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న సంయుక్తకు మాతృభాష మలయాళంలో మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు. అదే సమయంలో ఆమె పై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ ‘ప్రతి రోజూ సోషల్‌ మీడియా వేదికగా నాపై అసత్య ప్రచా రం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారం కొందరి కి రోజువారీ విధిగా మారిపోయింది. హీరోహీరోయిన్లు, నటీనటులపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ వార్తలు అభిమానులు, ప్రేక్షకులు నమ్మేస్తున్నారు. ఇలాంటి ప్రచారంలో కొంచెం కూడా నిజం లేదు. పైగా నేను ఎవరినీ ప్రేమించలేదు. రహస్యంగా వివాహం చేసుకునే ఉద్దేశం లేదు ’ అని పేర్కొన్నారు. కాగా, సంయుక్త మేనన్‌ ఇపుడు ధనుష్‌ హీరోగా నటించిన ‘కర’తో పాటు ‘జూలై కాట్రిల్‌’ అనే తమిళ చిత్రాల్లో నటించారు. వీటిలో ‘కర’ ఈ నెల 30న విడుదల కానుంది.

Updated Date - Apr 28 , 2026 | 04:13 PM