ఫహాద్ ఫాజిల్.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ అదిరింది
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:44 PM
ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.
ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) లీడ్ రోల్‌లో ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don’t Trouble the Trouble). శశాంక్ యేలేటి (Shashank Yeleti) దర్శకుడిగా పరిచయం అవుతుండగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda), రాజమౌళి (S. S. Rajamouli) కుమారుడు కార్తికేయ (S. S. Karthikeya) కలిసి నిర్మించారు. సారా పాలేకర్ (Ssara Palekar), సౌరభ్ సచ్‌దేవ్ (Saurabh Sachdeva) ప్రధాన పాత్రలు చేశారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సోమవారం ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.
టీజర్‌ను చూస్తే.. మెజీషియన్ (ఫహాద్ ఫాజిల్) ఓ పాప ఎదుట కొత్త కొత్త మేజిక్స్ ట్రిక్స్ చేస్తూ అలరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మారు పాప మాయమై తనకు ఇష్టం వచ్చింది చేసేలా చేస్తాడు. అయితే సడన్‌గా ఆ పాప వింతగా ప్రవర్తిస్తూ ఓ ఆత్మలా వ్యవహరిస్తూ అద్భుతాలు చేస్తుంది. దీంతో మెజీషియన్ భయపడి తనకు దూరంగా పారిపోతుంటే ఆ పాప అతని వెంట పడడం అంతా ఆసక్తికరంగా ఉంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్11న తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లోను ప్రేక్షకుల ఎదుటకు రానుంది.