Fahadh Faasil: పుష్ప విలన్ ని దింపుతున్న అనిల్ రావిపూడి..

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:11 PM

ఈ ఏడాది మన శంకరవరప్రసాద్ గారు (Mana SahankaraVaraPrasad Garu) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన తరువాత సినిమాను విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

Fahadh Faasil

Fahadh Faasil: ఈ ఏడాది మన శంకరవరప్రసాద్ గారు (Mana SahankaraVaraPrasad Garu) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన తరువాత సినిమాను విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్న అనిల్.. ఈ సినిమా కోసం కూడా స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల నుంచి వెంకీ- అనిల్ చిత్రంలో తమిళ్ హీరో కార్తీ నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఆ ప్లేస్ లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)నటిస్తోన్నట్లు సమాచారం.

పుష్ప సినిమాతో తెలుగువారికి సుపరిచితుడిగా మారారు ఫహాద్ ఫాజిల్. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. పుష్ప 2 తరువాత ఫహాద్ ఫాజిల్ తెలుగులో నటించలేదు. కథలను ఆచితూచి ఎంచుకొనే ఈ మలయాళ హీరో దగ్గరకు అనిల్ వెళ్లి కథను వినిపించారని, ఆ కథ నచ్చడంతో వెంటనే ఫహాద్ కూడా ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం అగ్రిమెంట్ పనులు నడుస్తోన్నాయని, త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఫహాద్ ఫాజిల్ ను సినిమాలోకి ఆహ్వానించనున్నారని సమాచారం.

ఇప్పటికే వెంకీ- అనిల్ కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. మూడు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వస్తోన్న ఈ నాలుగో సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా భాగం అవుతుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. అందులోనూ ఈ చిత్రంలో ఫహాద్.. వెంకీకి విలన్ గా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అదే నిజమైతే వెంకీ- ఫహాద్ కి మధ్య సీన్స్ చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ- అనిల్ తమ విజయ పరంపరను కొనసాగిస్తారా..? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Feb 06 , 2026 | 03:14 PM