మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. సెకండ్ హాఫ్‌లో భారీ సర్ప్రైజ్?
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:01 PM
నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాపై కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. కథను బాలకృష్ణ స్వయంగా విని సెకండ్ హాఫ్‌లో మార్పులు సూచించారనే ప్రచారం జరుగుతోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వారసుడిగా మోక్షజ్ఞ (Mokshagna) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. 'బింబిసార' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ శ్రద్ధను తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'సింబా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రోజుకో క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న ఒక సంచలన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించిన పూర్తి కథను బాలకృష్ణ స్వయంగా విన్నారట. అంతేకాదు, కథ విన్న తర్వాత సెకండ్ హాఫ్‌లో కొన్ని కీలకమైన మార్పులు కూడా సూచించినట్లు తెలుస్తోంది. కొడుకు డెబ్యూ సినిమా కాబట్టి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో బాలయ్య ఇచ్చిన సలహాలకు దర్శకుడు వశిష్ట కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో మరో సర్ప్రైజ్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సెకండ్ హాఫ్‌లో బాలయ్య ఇచ్చే ఎంట్రీ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. నిజ జీవితంలో లాగే, వెండితెరపై కూడా మోక్షజ్ఞకు తండ్రి పాత్రలోనే బాలయ్య కనిపించబోతున్నారట. ఒకవైపు కొడుకు డెబ్యూ, మరోవైపు బాలయ్య పవర్‌ఫుల్ ప్రెజెన్స్ ఉంటే.. థియేటర్లలో నందమూరి అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాను సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మల అంశాలతో దర్శకుడు వశిష్ట తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే, మోక్షజ్ఞ – వశిష్ఠ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. వశిష్ఠకు ఇప్పటివరకు ‘బింబిసార’ ఒక్కటే విజయం సాధించిన సినిమా. మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'విశ్వంభర' ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ డెబ్యూని ఆయన చేతిలో పెట్టడం సరైనదేనా అని కొందరు సందేహిస్తున్నారు. కానీ, మోక్షజ్ఞను ఒక రొటీన్ మాస్ కథతో కాకుండా, ఒక కొత్త కాన్సెప్ట్‌తో గ్రాండ్‌గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే బాలయ్య వశిష్ఠను ఎంచుకున్నారని మరో టాక్ ఉంది. ఏది ఏమైనా సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చాకే ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఒక స్పష్టత వస్తుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మోక్షజ్ఞ సరసన యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శ్రీలీల, బాలయ్యతో 'భగవంత్ కేసరి' సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో ఆమె కథానాయికగా అలరించనుందనే వార్త ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతోంది. దీనిపై కూడా త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాలి. ఇక స్టోరీని బాలయ్య స్వయంగా ఫైనలైజ్ చేయడంతో అతి త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తన డెబ్యూ మూవీతో మోక్షజ్ఞ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.