బాలయ్య ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. 'NBK111' రిలీజ్ డేట్ ఫిక్స్?
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:05 PM
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న NBK111 మూవీ రిలీజ్ డేట్‌పై ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #NBK111. వీరసింహా రెడ్డి వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ మూవీపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్ చేంజ్.
అసలు విషయంలోకి వెళితే.. ఎటువంటి డూప్స్ వాడకుండా రిస్కీ యాక్షన్ సీన్స్ చేయడంలో నందమూరి బాలకృష్ణ స్టైలే వేరు. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా బాలకృష్ణకి చిన్నపాటి మజిల్ టేర్ అయ్యింది. దాంతో ఆయనకి ఒక చిన్నపాటి సర్జరీ జరిగింది. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని, మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాలయ్య హెల్త్ అప్‌డేట్ తెలియడంతో అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
బాలయ్య గాయపడటంతో షూటింగ్ షెడ్యూల్స్ కాస్త మారాయి. దీనితో NBK111 విడుదల తేదీ కూడా మారినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దసరా బరిలో గానీ, లేదా డిసెంబర్ 4వ తేదీన గానీ విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ బాలయ్య కోలుకోవడానికి సమయం పట్టడం, మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' చిత్రం సరిగ్గా డిసెంబర్ 4నే రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్లాష్ లేకుండా, సోలోగా ఇయర్ ఎండింగ్‌లో డిసెంబర్ 24న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
డిసెంబర్ 24న రిలీజ్ చేస్తే క్రిస్మస్ సెలవుల అడ్వాంటేజ్‌తో బాక్సాఫీస్ కలెక్షన్లకు బాగా కలిసి వస్తాయని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో నాన్-స్టాప్‌గా షూటింగ్ జరిపి, నవంబర్ చివరి నాటికి టాకీ పార్ట్‌తో పాటు పాటల చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ చేసి, క్రిస్మస్ హాలిడేస్ సీజన్‌ను క్యాష్ చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని బాలకృష్ణను పక్కా మాస్, పవర్ ఫుల్ యాక్షన్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. మరి హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.