Bigg Boss: రోహిత్ ఇంత నీచానికి దిగజారడా.. భయంకర నిజాలు చెప్పిన కృష్ణుడు
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:55 PM
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు. ఇప్పటివరక 9 సీజన్స్ ఎంతో విజయవంతంగా జరిగాయి. కానీ, సీజన్ 10 మాత్రం అత్యంత దారుణంగా విఫలమయ్యిందని ట్రోల్స్ నడుస్తున్నాయి.
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)తెలుగు. ఇప్పటివరక 9 సీజన్స్ ఎంతో విజయవంతంగా జరిగాయి. కానీ, సీజన్ 10 మాత్రం అత్యంత దారుణంగా విఫలమయ్యిందని ట్రోల్స్ నడుస్తున్నాయి. అన్నీ సీజన్స్ లో కామనర్స్, సెలబ్రిటీస్ కలిసి ఆదేవరు. కానీ ఈ సీజన్ లో మాత్రం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఆడుతున్నారు. దీంతో హౌస్ లో గొడవలు, బూతులు, మాటల తూటాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రముఖ నటుడు కృష్ణుడు తాజాగా బిగ్ బాస్ లో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ ని బయటపెట్టాడు. ముఖ్యంగా షోలోని కంటెస్టెంట్లకు ఉండే పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
హౌస్ నుంచి బయటకు వచ్చాక.. రోహిత్ పీఆర్ టీమ్ ఎలా పనిచేస్తుందో చెప్పుకొచ్చాడు. తను హౌస్ లో ఉన్నప్పుడు తన భార్యకు ఎదురైన ఒక నిజమైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ కృష్ణుడు ఈ విషయాలను బట్టబయలు చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రోహిత్ గురించి ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడితే, వారిని సోషల్ మీడియాలో టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేయడానికి ఒక వ్యక్తికి నెలకు ప్రత్యేకంగా రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు సదరు వ్యక్తి తన భార్యతో నేరుగా చెప్పాడని ఆయన వెల్లడించాడు. బిగ్ బాస్ షోలోకి వెళ్లే ముందు కంటెస్టెంట్లకు బయట ఇలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ ఉంటాయనే విషయం తనకు అసలు తెలియదని, ఎలాంటి వ్యూహాలు, ప్లానింగ్స్ లేకుండానే తాను షోలోకి అడుగుపెట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు.
దీంతో రోహిత్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తోంది. అసలు మరీ ఇంత దారుణంగా.. ట్రోల్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకోవడం ఏంటి.. ? గెలవడానికి ఇంతగా దిగజారాలా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. రోహిత్ గేమ్ గురించి, కంటెస్టెంట్స్ గురించి మొత్తం తెలుసుకొని.. అంతా ముందే ప్లాన్ చేసుకొని హౌస్ లోకి వెళ్లాడని.. గేమ్ గెలిచినా.. గెలవకపోయినా.. అతను ఏ గొడవ తెచ్చినా అతనికి సపోర్ట్ గా ఉండే పీఆర్ టీమ్ ఒకటి అయితే.. ఎవరైతే రోహిత్ చేసింది తప్పు అని అంటారో.. వారిని ట్రోల్ చేయడానికి కూడా మనుషులను పెట్టడం అనేది మహా దారుణమని చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా, బిగ్ బాస్ సీజన్ 10లో విజేతగా నిలిచేందుకు కంటెస్టెంట్లు రూ.30 వేలు ఇచ్చి మరీ ఆర్టిఫిషియల్ ట్రోలింగ్, పెయిడ్ పీఆర్ స్టంట్స్ చేయిస్తున్నారంటూ కృష్ణుడు చేసిన ఈ సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నిజమైన ఆటగాళ్లను తొక్కేసేందుకు ఇలాంటి పీఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయా అని బిగ్ బాస్ ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.