EVV Cinema: హర్ష రోషన్ హీరోగా ఈవీవీ బ్యానర్ కొత్త సినిమా

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:52 AM

ఈవీవీ సినిమా(Evv Cinema)ప్రతిష్ఠాత్మకంగా,  వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ.వీ.వీ.సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి.

EVV Cinema New Movie

ఈవీవీ సినిమా(Evv Cinema)ప్రతిష్ఠాత్మకంగా,  వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ.వీ.వీ.సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ఈ  బ్యానర్‌పై ఈవీవీ తనయుడు ఆర్యన్‌ రాజేష్‌(Aryan Rajesh), మరో నిర్మాత ఎన్‌.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మించబోతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా, ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. 

Aryan 2.jfif

హర్ష్ రోషన్ (Harsh Roshan) హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు.  నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమ కథను  రూపొందించ నున్నారు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ఆర్యన్ రాజేష్ క్లాప్ ఇచ్చారు.  త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. 

ALSO READ:
Sai Abhyankkar: ఐకాన్‌స్టార్‌పై జెన్‌జీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వైరల్‌ కామెంట్స్‌

సత్యదేవ్‌.. ‘రావు బహదూర్‌’ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే..

భార్యకు రూ. 400 కోట్లు భరణం ఇచ్చిన స్టార్ హీరో..

Updated Date - Jul 04 , 2026 | 12:10 PM