‘ఎవరే’ ప్రైవేట్ అల్బమ్.. మంచి హిట్ అవుతుంది
ABN , Publish Date - Apr 23 , 2026 | 06:24 PM
‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్ మే 1న యూట్యూబ్‌లో విడుదల కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అంబటి అర్జున్, సాకేత్, వర్దన్ టీమ్ పాట సక్సెస్‌పై నమ్మకం వ్యక్తం చేశారు.
అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పణలో, శిరీష మండవిల్లి నిర్మాణంలో రూపొందిన ప్రైవేట్ ఆల్బమ్ ‘ఎవరే’ (Evare). ఆనంద్ ఈ ఆల్బమ్‌కు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ వర్దన్ సంగీతం సమకూర్చగా, వేచలపు కృష్ణ, రిద్ధి అనామిక చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పాటను మే 1న ‘క్రేజీ ఎన్ క్యాచీ’ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు హీరో అంబటి అర్జున్ (Arjun Ambati), సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో అంబటి అర్జున్ మాట్లాడుతూ, ‘ఎవరే’ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి నిర్మాతలతోనే కొత్త ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు. మ్యూజిక్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తూ, ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. సింగర్ సాకేత్ మాట్లాడుతూ పాటలో ఎనర్జీ, మెలోడీ చక్కగా మిళితమయ్యాయని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వర్దన్ ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకున్నారు. రాంబాబు గోసాల ప్రోమో, లిరిక్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ, పాట విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ వర్దన్ మాట్లాడుతూ, ఈ పాట కోసం ఏడాది పాటు కష్టపడ్డామని తెలిపారు. టీం అందరి సహకారంతో పాట నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిందని అన్నారు. మే 1న రిలీజ్ అవుతున్న ఈ పాటకు ప్రేక్షకుల మద్దతు కోరారు. డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, ఏడాది క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణంలో టీం అందరి సహకారం ఎంతో ముఖ్యమని చెప్పారు. నిర్మాతల సపోర్ట్‌ను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. హీరో వేచలపు కృష్ణకు ‘ఎవరే’ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని చెప్పారు. హీరోయిన్ రిద్ధి అనామిక చరణ్ తెలుగులో ఇదే తొలి అవకాశం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సింగర్లు పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్ తమ అనుభవాన్ని పంచుకుంటూ, పాట వైరల్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లిరిసిస్ట్ మల్లిక వల్లభ పిట్ల టీం శ్రమను అభినందిస్తూ, మరిన్ని మంచి ప్రాజెక్టులు రావాలని ఆకాంక్షించారు.