థాయ్‌లాండ్‌ చెక్కేసిన ఈఎన్ఈ టీమ్‌!

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:21 PM

ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్‌ ఈఎన్ఈ రిపీట్‌ షూటింగ్‌ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు.

ENE Repeat Movie

'పెళ్ళిచూపులు' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. స్నేహం, సరదా కథనంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌ కంటే రీ-రిలీజ్‌ లో అద్భతమైన స్పందన అందుకుంది. కల్ట్ క్లాసిక్‌ అంటూ జన్ జీ ఈ సినిమాను నెత్తిన పెట్టుకుంది. దాంతో ఈ సక్సెస్‌ని కొనసాగిస్తూ మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ను తరుణ్‌ భాస్కర్‌ బృందం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.


విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకు రానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ నెల పాటు కొనసాగుతుంది. తాజా షూటింగ్‌ స్పాట్‌ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. 'టీమ్ కన్యారాశి' గ్యాంగ్‌కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు, వింటేజ్ కన్వర్టిబుల్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ ఫ్రేమ్ రెట్రో వైబ్‌, మోడరన్ బ్రో ట్రిప్ స్ఫూర్తితో అందంగా కనిపిస్తోంది. మొదటి భాగంలో ఉన్న కేర్‌ఫ్రీ స్పిరిట్, ఫన్‌ను మళ్లీ తెరపైకి తీసుకు రాబోతున్నారని ఈ స్టిల్‌ చూస్తుంటే అర్థమౌతోంది. ఈ ఒరిజినల్ టీమ్ తిరిగి కలవడంతో నాస్టాల్జియా కూడా యాడ్ అవుతోంది.

Updated Date - Apr 21 , 2026 | 05:21 PM