టీమ్ కన్యారాశి ట్రైలర్ తో వచ్చేస్తోంది
ABN , Publish Date - Oct 31 , 2026 | 07:07 PM
టాలీవుడ్ కల్ట్ హిట్ మూవీగా నిలిచిన ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) సినిమాని మరచిపోవడం తెలుగు యువతకు సాధ్యం కానీ పని.
టాలీవుడ్ కల్ట్ హిట్ మూవీగా నిలిచిన ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) సినిమాని మరచిపోవడం తెలుగు యువతకు సాధ్యం కానీ పని. తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను.. ఈ పేర్లు కంటే వివేక్, కౌశిక్, కార్తీక్, ఉప్పు పేర్లే ఎక్కువ గుర్తుంటాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అప్పట్లో ఈ సినిమా అంతా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఆ తరువాత మాత్రం ఈ చిత్రాన్ని తెలుగు యువత కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టారు.
ఇక దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ సీక్వెల్ ప్రకటించాడు. ENE రిపీట్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ (వివేక్), అభినవ్ గోమటం (కౌశిక్), వెంకటేష్ కాకుమాను (ఉప్పు) తో పాటు కొత్తగా శ్రీనాథ్ మగంటి కూడా ఈ కోర్ గ్రూప్లో చేరాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ సృజన్ యారబొలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ENE రిపీట్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను అనౌన్స్ చేశారు.
ENE రిపీట్ ట్రైలర్ నవంబర్ 3న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. టీమ్ కన్యారాశి ట్రైలర్ తో వస్తుంది అనగానే ప్రేక్షకులు సోషల్ మీడియాలో మరోసారి ఈ నగరానికి ఏమైంది రోజులను గుర్తుచేసుకుంటున్నారు. మొదటి పార్ట్ లానే రెండో పార్ట్ లో కూడా వింటేజ్ ఫ్రెండ్షిప్, సినిమా మేనియాతో కూడిన అల్లరి రైడ్ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలకానుంది. మరి ఈ చిత్రం ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
చిత్రానికి సీక్వెల్గా వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ENE Repeat' పై అంచనాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను అనౌన్స్ చేశారు. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి.. నవంబర్ 3న సాయంత్రం 5 గంటలకు అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.