ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘మిస్సింగ్‌ మేఘన’

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:56 AM

రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రధారులుగా ఫస్ట్‌ కాపీ మూవీస్‌, కేడీ అండ్‌ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మిస్సింగ్‌ మేఘన’ .

Missing Meghana

రామ్‌ కార్తీక్ (Ram Karthik), అమ్ము అభిరామి (Ammu Abhirami), వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య (Ankith Koyya) ప్రధాన పాత్రధారులుగా ఫస్ట్‌ కాపీ మూవీస్‌, కేడీ అండ్‌ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మిస్సింగ్‌ మేఘన’ (Missing Meghana). వాచస్పతి (Vachaspathi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాటను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేసి పాటలతో పాటు సినిమా కూడా పెద్ద హిట్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సంద‌ర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. ‘మంచి ఎమోషనల్‌ పాయింట్‌కి థ్రిల్లింగ్‌ అంశాలను జోడించాం. కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యే అన్నీ అంశాలూ సినిమాలో ఉంటాయి. ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి పేరొస్తోంది’ అని తెలిపారు. పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధృవన్‌ చెప్పారు.

Updated Date - Aug 31 , 2026 | 06:56 AM