Aakasamlo Oka Tara: దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:14 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదల తేదీ ఖరారైంది
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka thara). పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేయనుంది. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేలా రాబోయే రోజుల్లో వరుస అప్‌డేట్స్‌తో పాటు వినూత్నమైన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చిట్టి చిట్టి చీమ’ పాటకు మంచి స్పందన వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా పాటలపై కూడా అంచనాలు పెరిగాయి. లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు సినిమాను సమర్పిస్తున్నాయి.