Samantha: తల్లి కావాలని.. కలలు కన్నా
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:27 AM
ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ తో సూపర్ హిట్ సాధించిన సమంత తాజాగా మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గర్భిణిగా తన జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు హీరోయిన్ సమంత (Samantha). ఇటీవలే విడుదలైన ‘మా ఇంటి బంగారం’(Maa Inti Bangaaram) తో సూపర్ హిట్ సాధించిన ఆమె, తాజాగా మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ప్రతి మహిళ జీవితంలో అత్యంత కీలకమైన ఈ మాతృత్వ దశను అనుభవించడానికి చాలా కాలంగా కలలు కన్నాను. ఈ నూతన అధ్యాయం నాకెంతో ప్రత్యేకం. ఈ బాధ్యత నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ప్రతీ విషయాన్ని ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నా.
నటిగా నేను పోషించే పాత్రను పూర్తిగా తెలుసుకుని దానికి వందశాతం న్యాయం చేయడానికి కష్టపడతా. అలాగే అభిమానులు నాపై చూపించే ప్రేమను ఎంతో అపురూపంగా భావిస్తా. వారి ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు సమంత.