యన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది లేనట్టే

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:30 PM

'దేవర' సినిమా తరువాత ఇక వరుసగా జూనియర్ యన్టీఆర్ (NTR) మూవీస్ వస్తాయని ఆశించారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే 'దేవర' కాగానే మరుసటి సంవత్సరం 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించారు జూనియర్...

NTR Neel

'దేవర' సినిమా తరువాత ఇక వరుసగా జూనియర్ యన్టీఆర్ (NTR) మూవీస్ వస్తాయని ఆశించారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే 'దేవర' కాగానే మరుసటి సంవత్సరం 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించారు జూనియర్... ఈ యేడాది ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంతో యన్టీఆర్ జనం ముందుకు వస్తారని ఆశించారు అభిమానులు... ఈ సినిమా షూటింగ్ లో జాప్యం తప్పదు అన్న మాట వినిపిస్తోంది. ఈ యేడాది చివరలో ఈ మూవీ వస్తుందని ఆశించారు. కానీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న రవి బస్రూర్ సైతం ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారంటే నిజమేగా అంటున్నారు సినీ ఫ్యాన్స్ ... అందువల్ల యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ 2027లోనే ఉంటుందని భావించవచ్చు.

క్రేజీ ప్రాజెక్ట్స్ రాజమౌళి- మహేశ్ బాబు మూవీ 'వారణాసి', అల్లు అర్జున్ - అట్లీ కుమార్ సినిమా కూడా 2027లోనే జనం ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ చిత్రం కూడా అదే యేడాది వస్తే - టాలీవుడ్ ఆశలు పెట్టుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే సంవత్సరమే వెలుగు చూస్తాయని చెప్పవచ్చు. 'వారణాసి' చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ - అట్లీ కుమార్ మూవీ కూడా వచ్చే సంవత్సరం వేసవిలో రానుందని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా సైతం అదే ప్రాంతంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

ఆలస్యం అమృతం విషం - అన్నారు... కానీ, స్టార్ మూవీస్ కు ఆలస్యమే అమృతంగా మారుతుందని యన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు... గతంలో కూడా యన్టీఆర్ నటించిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి రాలేక, ఆలస్యంగా వచ్చినా బంపర్ హిట్స్ అయ్యాయని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు... ఏది ఏమైనా యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ కూడా ఇదీ అని అధికారికంగా ప్రకటించలేదు... ఇప్పటి దాకా ఈ సినిమా టైటిల్ 'డ్రాగన్' అంటూ వినిపిస్తోంది... ఈ యేడాది మే 20న యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అసలు టైటిల్ వెలుగు చూస్తుందని అంటున్నారు... మరి ఏ టైటిల్ తో యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ రూపొందుతుందో, ఆ చిత్రం ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి...

Updated Date - Mar 09 , 2026 | 10:10 PM