పంచాలి పంచభర్తృక ట్రైలర్ విడుదల.. రాజేంద్ర ప్రసాద్ కామెడీతో నవ్వుల జాతర
ABN , Publish Date - Jul 29 , 2026 | 04:24 PM
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన 'పంచాలి పంచభర్తృక' ట్రైలర్ విడుదలైంది.
ప్రముఖ నటుడు పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ (Dr. Rajendra Prasad) కీలక పాత్రలో దర్శకుడు గంగా సప్తశిఖర (Ganga Sapthasikhara) తెరకెక్కించిన చిత్రం పంచాలి పంచభర్తృక (Panchali Panchabhartruka). పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్‌తోనే ఎంతో ఆసక్తి కలిగించిన ఈ సినిమా తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో ఆ ఆసక్తిని మరింత పెంచింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే వినోదభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. కథలోని ప్రధాన పాత్ర చుట్టూ జరిగే అనూహ్య పరిణామాలు, వాటి వల్ల వచ్చే గందరగోళం, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్‌తో ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ చిత్రంలో సరీహ్ ఫార్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మన్యం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు మహేష్ నారాయణ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మంచి ఎనర్జీని తీసుకొచ్చింది. సన్నివేశాలకు తగ్గట్టుగా బీజీఎమ్ ఉండటం ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన 'పంచాలి పంచభర్తృక', ఇప్పుడు ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఓ వైపు నవ్వులు పంచుతూ అనుకోకుండా మరణించిన యువతి డెడ్ బాడాని మాయం చేసేందుకు వారు పడిన తాపత్రాయాల నేపత్యంలో మూవీ ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించినట్లు తెలుస్తోంది.