శ్యామలాదేవి చేతుల మీదుగా మొదలైన 'దొరికిందా!' చిత్రం
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:10 PM
నూతన నటీనటులతో 'దొరికిందా' సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నిర్మాతలు అశోక్ కుమార్, పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు.
వి.టి. ఎంటర్ ప్రైజెస్ పతాకంపై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న సినిమా 'దొరికిందా'. తాజాగా మొదలైన ఈ సినిమా ప్రారంభోత్సవంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొని క్లాప్ కొట్టారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ స్విచ్చాన్ చేశారు. టీమ్‌కు సినిమా స్క్రిప్ట్ ను మరో నిర్మాత పద్మినీ నాగులపల్లి అందించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ, 'మా చిత్రానికి ఫ్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించిన మా అమ్మ శ్యామలాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా చిత్రం 'దొరికిందా' మంచి కమర్షియల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పాత కొత్త నటీనటులు నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను' అని అన్నారు. ఈ చిత్రానికి జాక్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సడ్లపల్లి వెంకటేశ్ రెడ్డితో పాటు అశ్వద్థ రాయల్ దీనిని నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి:
తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ
చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా
ఎన్టీఆర్- త్రివిక్రమ్ టైటిల్ మారిందిరో..